

రాజమౌళి ‘బాహుబలి’తో భారతీయ సినీ పరిశ్రమను కొత్త స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడిగా నిలిచారు. పాన్ ఇండియా, సీక్వెల్ ట్రెండ్‌కు ఆయన ఒక విధంగా ఆద్యుడు. ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ సినిమాను ఒకే భాగంగా విడుదల చేస్తామని మొదట ప్రకటించినప్పటికీ, ఇప్పుడు ఆ ఆలోచనలో మార్పు వచ్చినట్లు సమాచారం. ప్రేక్షకుల అభిరుచులు మారుతున్న నేపథ్యంలో కొత్త వ్యూహాన్ని పరిశీలిస్తున్నారని తెలుస్తోంది.
ఇటీవల పుష్ప 2 వంటి సినిమాలు సక్సెస్ సాధించడంతో మళ్లీ సీక్వెల్‌లపై ఆసక్తి పెరిగింది. త్రేతాయుగం నుంచి భవిష్యత్తు వరకు విస్తరించిన కథాంశం ఉన్న ‘వారణాసి’ని రెండు భాగాలుగా విడుదల చేస్తే కథను మరింత విస్తృతంగా చూపించవచ్చని రాజమౌళి భావిస్తున్నారని సమాచారం. ఒకవేళ ఈ నిర్ణయం తీసుకుంటే, రెండు భాగాలను తక్కువ గ్యాప్‌తో విడుదల చేయాలని కూడా పరిశీలిస్తున్నట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.





















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!