

పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు వాయిదాలు వేస్తూ రూ.9.35 కోట్లు కాజేసిన ఆరోపణలపై సినీనటి అషురెడ్డి, ఆమె కుటుంబ సభ్యులపై హైదరాబాద్ సీసీఎస్‌లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... హైదరాబాద్ షేక్‌పేట్‌వాసి యెనుముల సత్యనారాయణ కుమారుడు వై.వి.ధర్మేంద్ర లండన్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నారు. 2018లో భారత్‌కు వచ్చిన సమయంలో అతనికి అషురెడ్డి(వెంకట అశ్వినిరెడ్డి కొయ్య) పరిచయమైంది. తాను అమెరికాలో చదువు పూర్తి చేసి సినిమాల్లో అవకాశాల కోసం హైదరాబాద్‌కు వచ్చినట్లు చెప్పింది. పరిచయమైన కొద్ది రోజుల్లోనే ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకుందామని ధర్మేంద్రను నమ్మించి, ఆర్థిక అవసరాల పేరుతో డబ్బులు అడగటం ప్రారంభించారు. కారు, బంగారం, ఆస్తులు కొనుగోలు చేయించుకుని తన పేరిటే రిజిస్టర్ చేయించుకుంది. తర్వాత అషురెడ్డి కుటుంబ సభ్యులు ధర్మేంద్రను కలిసి సంబంధాన్ని ఖాయం చేస్తున్నామంటూ పండితుడిని పిలిపించి హడావుడి చేశారు. ‘‘అనంతరం ముఖం చాటేసి, పలుమార్లు అడిగినా పెళ్లికి నిరాకరించింది. 2025 వరకు ఆమె నా కుమారుడి నుంచి రూ.9.35 కోట్ల విలువ చేసే నగదు, బంగారం(సుమారు 5 కిలోలు), ఫ్లాట్‌లు, వాహనాలు కొనుగోలు చేయించుకుంది. అదనంగా ఆమె సోదరి కూడా రూ.50 లక్షలు తీసుకుంది’’ అని ధర్మేంద్ర తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నారు. సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!