Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

నూరుశాతం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం: కేసీఆర్‌

01:17 AM, 21 ఏప్రిల్, 2026
నూరుశాతం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం: కేసీఆర్‌

జగిత్యాల వేదికగా బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ మరోసారి కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్ర సాధన కోసం ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని, ప్రజల ఆశీర్వాదంతో తెలంగాణను సాధించామని గుర్తుచేశారు. పదేళ్లపాటు సుభిక్షంగా పాలించిన రాష్ట్రాన్ని ప్రస్తుత ప్రభుత్వం ఆగం చేస్తోందని ఆరోపించారు. రాజకీయ శక్తుల పునరేకీకరణతో తెలంగాణ పునర్నిర్మాణానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. నూటికి నూరు శాతం మళ్లీ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

జగిత్యాలలో జరిగిన ప్రజాశీర్వాద సభలో మాజీ మంత్రి జీవన్‌రెడ్డిని పార్టీకి ఆహ్వానించిన కేసీఆర్‌, పలువురు నేతలకు కండువా కప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిందని, రైతులు, కార్మికులు, ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. భూముల ధరలు పడిపోయాయని, పంటలకు సరైన ధరలు లభించడం లేదని విమర్శించారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెరిగాయని, సింగరేణి సంస్థ దెబ్బతిందని, నీటిపారుదల ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురయ్యాయని తెలిపారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కాలేదని, కొత్త సంక్షేమ పథకాలు ప్రారంభించలేదని కేసీఆర్‌ విమర్శించారు. బీఆర్‌ఎస్‌ పాలనలో పల్లె ప్రగతి, గ్రామాభివృద్ధి కార్యక్రమాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని గుర్తుచేశారు. ప్రస్తుతం పట్టణాలు, గ్రామాలు నిర్లక్ష్యానికి గురయ్యాయని అన్నారు. ప్రజలందరూ కలిసి బీఆర్‌ఎస్‌ను మళ్లీ అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు.

వ్యవసాయ బోర్లకు విద్యుత్‌ మీటర్లు పెట్టే యత్నాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ, దీనిపై పోరాటానికి సిద్ధమవ్వాలని కేసీఆర్‌ పిలుపునిచ్చారు. గతంలో కేంద్ర ఒత్తిడిని తిప్పికొట్టామని, ఇప్పుడు అదే అంశాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం అంగీకరిస్తోందని విమర్శించారు. తెలంగాణ భవిష్యత్తు కోసం మళ్లీ పోరాటం అవసరమని ఆయన స్పష్టం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పొలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీలను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ!

పొలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీలను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ!

తెలంగాణపై తేజస్వి సూర్య వ్యాఖ్యలు వివాదాస్పదం

తెలంగాణపై తేజస్వి సూర్య వ్యాఖ్యలు వివాదాస్పదం

దక్షిణాది చిత్ర పరిశ్రమలో చారిత్రాత్మక ఐక్యత...

దక్షిణాది చిత్ర పరిశ్రమలో చారిత్రాత్మక ఐక్యత...

తేజస్వి సూర్య వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు: బీజేపీ చీఫ్ రాంచందర్ రావు!

తేజస్వి సూర్య వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు: బీజేపీ చీఫ్ రాంచందర్ రావు!

2027 వరకు ప్రధాన సెలెక్టర్‌గా అగర్కర్ కొనసాగింపు

2027 వరకు ప్రధాన సెలెక్టర్‌గా అగర్కర్ కొనసాగింపు

రాహుల్‌  వ్యాఖ్యలపై లోక్‌సభలో రగడ!

రాహుల్‌ వ్యాఖ్యలపై లోక్‌సభలో రగడ!

బాలయ్య - కొరటాల శివ కాంబినేషన్ ఖరారా?.. క్రేజీ బజ్ వైరల్!

బాలయ్య - కొరటాల శివ కాంబినేషన్ ఖరారా?.. క్రేజీ బజ్ వైరల్!

ఇరాన్ నుండి భారత్ కు చేరిన పెట్రోల్, డీజిల్

ఇరాన్ నుండి భారత్ కు చేరిన పెట్రోల్, డీజిల్

విప్రోలో భారీ మార్పులు.. క్యాంపస్ నియామకాలకు బ్రేక్

విప్రోలో భారీ మార్పులు.. క్యాంపస్ నియామకాలకు బ్రేక్

క్రోమ్‌లో కొత్త 'స్కిల్స్' ఫీచర్‌ను  ప్రవేశ పెట్టిన గూగుల్

క్రోమ్‌లో కొత్త 'స్కిల్స్' ఫీచర్‌ను ప్రవేశ పెట్టిన గూగుల్

ట్యాగ్లు
కేసీఆర్‌బీఆర్‌ఎస్‌తెలంగాణ రాజకీయాలుకాంగ్రెస్‌జగిత్యాల సభరైతులుప్రభుత్వం
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఎంపీ శశి థరూర్‌ను కలిసిన హీరోయిన్ ప్రియాంకా మోహన్
సినిమాలు

ఎంపీ శశి థరూర్‌ను కలిసిన హీరోయిన్ ప్రియాంకా మోహన్

వేసవిలో పుచ్చకాయపై డాక్టర్ల అలర్ట్.. ఇలా తింటేనే లాభం
ఆరోగ్యం

వేసవిలో పుచ్చకాయపై డాక్టర్ల అలర్ట్.. ఇలా తింటేనే లాభం

చెరీ 2026 బిజినెస్ సమ్మిట్‌లో ఏఐ మరియు రోబోటిక్స్ ప్రదర్శన
టెక్నాలజీ

చెరీ 2026 బిజినెస్ సమ్మిట్‌లో ఏఐ మరియు రోబోటిక్స్ ప్రదర్శన

ఏడు నెలల తర్వాత ఓటీటీలోకి 'మత్తురా' మూవీ!
ఓటిటి

ఏడు నెలల తర్వాత ఓటీటీలోకి 'మత్తురా' మూవీ!

టీ తాగిన వెంటనే నీళ్లు తాగుతున్నారా.. నిపుణుల హెచ్చరిక
ఆరోగ్యం

టీ తాగిన వెంటనే నీళ్లు తాగుతున్నారా.. నిపుణుల హెచ్చరిక

ఈవీ రంగంలో కొత్త అడుగు.. హ్యుండయ్-టీవీఎస్ వ్యూహాత్మక ఒప్పందం
బిజినెస్

ఈవీ రంగంలో కొత్త అడుగు.. హ్యుండయ్-టీవీఎస్ వ్యూహాత్మక ఒప్పందం

మణిపూర్ ఉద్రిక్తతలు: వైరల్ నిరసన వ్యాఖ్యతో జాతీయ ప్రాధాన్యతలపై ప్రశ్నలు
న్యూస్

మణిపూర్ ఉద్రిక్తతలు: వైరల్ నిరసన వ్యాఖ్యతో జాతీయ ప్రాధాన్యతలపై ప్రశ్నలు

ఏఐ విస్తరణతో అణుశక్తిపై మళ్లీ దృష్టి
టెక్నాలజీ

ఏఐ విస్తరణతో అణుశక్తిపై మళ్లీ దృష్టి

చార్‌ధామ్ యాత్రలో భక్తులకు షాక్..గంగోత్రి ఆలయంలో కొత్త నిబంధన
న్యూస్

చార్‌ధామ్ యాత్రలో భక్తులకు షాక్..గంగోత్రి ఆలయంలో కొత్త నిబంధన

విప్రోలో భారీ మార్పులు.. క్యాంపస్ నియామకాలకు బ్రేక్
బిజినెస్

విప్రోలో భారీ మార్పులు.. క్యాంపస్ నియామకాలకు బ్రేక్

మహిళలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలి - మంత్రి సీతక్క
రాజకీయాలు

మహిళలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలి - మంత్రి సీతక్క

ఏపీ సీఎంకు తెలంగాణ మంత్రి పొన్నం లేఖ
రాజకీయాలు

ఏపీ సీఎంకు తెలంగాణ మంత్రి పొన్నం లేఖ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!