
న్యూస్

జాకీర్ ఖాన్ ముంబైలో జరిగిన స్క్రీన్ అవార్డ్స్ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్లో వివాదానికి దారితీశాయి. ‘ధురంధర్’ సినిమా విజయంపై మాట్లాడుతూ, పరిశ్రమలో కొందరికి అసూయ కలుగుతోందని సూచించేలా ఆయన చేసిన జోక్ పలువురిని అసహనానికి గురి చేసింది. ఈ వ్యాఖ్యలపై అమీషా పటేల్ తీవ్రంగా స్పందిస్తూ, అనవసర నెగిటివిటీని వ్యాప్తి చేయవద్దని సూచించింది. బాలీవుడ్ ఎప్పుడూ విజయవంతమైన సినిమాలను గౌరవిస్తుందని ఆమె స్పష్టం చేసింది.
ఈ విషయంపై సిద్ధార్థ్ ఆనంద్ కూడా స్పందిస్తూ, గత అనేక దశాబ్దాలుగా జుహూ-బాంద్రా ప్రాంతాల వారు ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలను అందించారని గుర్తుచేశారు. పరిశ్రమ కృషిని తక్కువ చేసి మాట్లాడడం సరైంది కాదని ఆయన విమర్శించారు. ఇప్పటికే ఇతర వ్యాఖ్యల కారణంగా చర్చల్లో ఉన్న ఈ అవార్డుల వేడుక, ఇప్పుడు జాకీర్ ఖాన్ వ్యాఖ్యలతో మరింత హాట్ టాపిక్‌గా మారింది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!