
న్యూస్

అమెరికాలో భారీ మంచు తుఫాన్ ప్రజలను వణికిస్తోంది. గడ్డకట్టే చలితో దేశవ్యాప్తంగా 15 కోట్ల మందికి పైగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విపరీతమైన మంచు వర్షాల కారణంగా విమాన రాకపోకలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దాదాపు 1,800కు పైగా విమానాలను అధికారులు రద్దు చేయగా, రహదారులు, రైల్వే మార్గాలపై కూడా తీవ్ర ప్రభావం పడింది. కొన్ని ప్రాంతాల్లో చెట్లు విరిగి పడటంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని అధికారులు 15 రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేశారు. వైట్ హౌస్ కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. సోమవారం వరకు ఇదే పరిస్థితి కొనసాగవచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.







.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!