
రాజకీయాలు

ప్రముఖ అమర్‌నాథ్ యాత్రకు ఈ ఏడాది ముహూర్తం ఖరారైంది. జూలై 3 నుంచి ఆగస్టు 28 వరకు మొత్తం 57 రోజుల పాటు ఈ పవిత్ర యాత్ర కొనసాగనుంది. ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా దేశవ్యాప్తంగా వేలాది మంది భక్తులు యాత్రలో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు. యాత్ర నిర్వహణకు సంబంధించి అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభించినట్లు సమాచారం.
ఈ యాత్రకు నమోదు ప్రక్రియ ఏప్రిల్ 15 నుంచి ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా ఉన్న 554 బ్యాంక్ బ్రాంచుల్లో భక్తులు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. భద్రతా కారణాల దృష్ట్యా 13 ఏళ్ల లోపు పిల్లలు మరియు 70 ఏళ్లు పైబడిన వారికి యాత్రలో పాల్గొనే అనుమతి లేదని అధికారులు స్పష్టం చేశారు.












.jpg&w=3840&q=75)









కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!