
న్యూస్

అమిత్ షా పశ్చిమ బెంగాల్ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోను ‘సంకల్ప పత్ర’ పేరుతో విడుదల చేశారు. ప్రతి మహిళకు నెలకు 3 వేల రూపాయలు, యువతకు నెలకు 3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో యూసీసీ అమలు చేస్తామని, సెవెన్త్ పే కమిషన్ అమలు చేస్తామని తెలిపారు.
బెంగాల్ అభివృద్ధికి 100 రోజుల్లో రోడ్ మ్యాప్ రూపొందిస్తామని, గర్భిణీలకు రూ.21 వేల సాయం అందిస్తామని ప్రకటించారు. ధాన్యానికి రూ.3,100 కనీస మద్దతు ధర కల్పిస్తామని, ఉత్తర బెంగాల్‌లో ఐఐటీ, ఐఐఎం ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో 33 శాతం మహిళలకు రిజర్వేషన్ ఇస్తామని, చొరబాట్లను అడ్డుకుంటామని పేర్కొన్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!