

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బీజేపీ కీలక ఎజెండాలైన ఉమ్మడి పౌర స్మృతి, ‘ఒకే దేశం ఒకే ఎన్నికలు’ అమలు దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయని తెలిపారు. బీజేపీ 47వ వార్షికోత్సవం సందర్భంగా కార్యకర్తలతో వర్చువల్‌గా మాట్లాడిన ఆయన, ఈ అంశాలపై చర్చలు వేగంగా జరుగుతున్నాయని, సానుకూల పురోగతి కనిపిస్తోందని చెప్పారు. చట్టసభల్లో మహిళల రిజర్వేషన్ల అంశాన్ని 1994 లోనే బీజేపీ ప్రస్తావించిందని గుర్తు చేశారు.
ప్రస్తుతం ప్రభుత్వం మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయడానికి కట్టుబడి ఉందని, 2029 లోక్‌సభ మరియు అసెంబ్లీ ఎన్నికల్లో వాటిని అమలు చేసేలా చూస్తామని మోదీ హామీ ఇచ్చారు. ఆర్టికల్ 370 రద్దు, కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణం, ట్రిపుల్ తలాక్ రద్దు, పౌరసత్వ సవరణ చట్టం వంటి కీలక నిర్ణయాలను ఆయన ప్రస్తావించారు. కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పిస్తూ, ఒక కుటుంబానికే ప్రాధాన్యం ఇస్తుందని ఆరోపించారు. బీజేపీ మాత్రం సేవా భావంతో దేశానికి పని చేస్తుందని, ప్రతి కార్యకర్తకు సమాన గౌరవం ఉంటుందని తెలిపారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!