
న్యూస్

సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం పారిశ్రామిక ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. న్యూట్రన్ మహాలక్ష్మి సాల్వెంట్ రసాయన పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగి, కిలోమీటర్ మేర దట్టమైన పొగ వ్యాపించింది. మంటల తీవ్రతతో పరిసర ప్రాంతాలు భయాందోళనలకు గురయ్యాయి.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. సాల్వెంట్ రసాయన డ్రమ్‌లు పేలడంతోనే ఈ అగ్నిప్రమాదం సంభవించినట్లు సమాచారం. చుట్టుపక్కల పరిశ్రమలకు మంటలు వ్యాపించే ప్రమాదం ఉండడంతో అప్రమత్త చర్యలు చేపట్టారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!