
గాసిప్స్

వెనెజువెలాపై అమెరికా చేపట్టిన చర్యలను ప్రపంచంలోని అనేక దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. మెక్సికో, క్యూబా, కొలంబియా, రష్యా, ఇరాన్, ఉత్తర కొరియా వంటి దేశాలు అమెరికా వైఖరిపై బహిరంగంగా విమర్శలు గుప్పించాయి. ఈ చర్యలు ప్రాంతీయంగా, అంతర్జాతీయంగా అస్థిరతకు దారి తీసే ప్రమాదం ఉందని ఆయా దేశాలు అభిప్రాయపడ్డాయి. వెనిజులా తర్వాత మెక్సికో, క్యూబా, కొలంబియా తదుపరి లక్ష్యాలుగా మారవచ్చని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించినట్లు సమాచారం. ఈ దేశాలకు డ్రగ్స్ అక్రమ రవాణాతో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు చేసినట్లు తెలుస్తోంది. ఈ వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ప్రతిస్పందనలకు దారి తీసి, అమెరికా ఉద్దేశాలపై సందేహాలు వ్యక్తమయ్యేలా చేశాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!