

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా, రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా, దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం “డ్రాగన్”పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా దాదాపు మూడు సంవత్సరాల క్రితం ప్రకటించబడింది. షూటింగ్ ప్రారంభమై ఏడాదిన్నర గడిచినా ఇంకా చాలా భాగం పూర్తికావాల్సి ఉంది.
మొదట ఈ సినిమాను ఈ ఏడాది జూన్‌లో విడుదల చేయాలని భావించారు. కానీ ఇంకా షూటింగ్ మిగిలి ఉండటంతో ఆ తేదీకి విడుదల కావడం కష్టమని తెలుస్తోంది. దీంతో అభిమానులు కొంత నిరాశకు గురవుతున్నారు.
ఇటీవల వినిపిస్తున్న వార్తల ప్రకారం “డ్రాగన్” పూర్తవ్వడానికి ఇంకా ఏడాదిన్నర సమయం పట్టే అవకాశం ఉంది. అందువల్ల వచ్చే ఏడాది డిసెంబర్‌లో విడుదల అయినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. అయితే ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో అధికారిక ప్రకటన వచ్చే వరకు తెలియదు. ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ మరియు మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.












.png&w=3840&q=75)









కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!