

బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ ముంబైలో జరిగిన వరల్డ్ పికిల్ బాల్ లీగ్ 2026 కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభిమానులతో కలిసి పికిల్ బాల్ ఆడారు. ఆట జరుగుతున్న సమయంలో బాల్‌ను కొట్టే ప్రయత్నంలో ఆయన అదుపుతప్పి ముందుకు పడిపోయారు. అయితే ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదు. కిందపడిన వెంటనే లేచి, నవ్వుతూ మళ్లీ ఆటను కొనసాగించారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో ఆమిర్ ఖాన్ ఎంతో చురుకుగా బాల్‌ను ప్రత్యర్థి వైపు కొట్టడం, మరోసారి ముందుకు వెళ్లి కొట్టే ప్రయత్నంలో పడిపోవడం కనిపిస్తుంది. ఆయన పడిపోయిన వెంటనే అక్కడ ఆడుతున్న యువతి చేయి అందించి పైకి లేపింది. ఆమిర్ మళ్లీ బ్యాట్ పట్టుకుని చిరునవ్వుతో ఆటను కొనసాగించారు.
ఈ వీడియోపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. ‘60 ఏళ్ల వయసులోనూ ఇంత ఫిట్‌గా ఉండటం గొప్ప విషయం’ అని కొందరు ప్రశంసిస్తుంటే, ‘అందరి ముందు ఇలా జరగడం బాధగా ఉంది’ అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. వీడియోకు పెట్టిన మ్యూజిక్‌పై కూడా కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!