
సినిమాలు

యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో వదంతులు మరియు తప్పుడు సమాచారం ప్రచారం చేసినందుకు ఖతార్‌లో 313 మందిని అధికారులు అరెస్ట్ చేశారు. ఇరాన్ దాడులకు సంబంధించిన వీడియోలను చిత్రీకరించి ప్రచారం చేయడంతో ప్రజల్లో భయం, ఆందోళనలు పెరిగాయని అధికారులు తెలిపారు. తప్పుడు వార్తలు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది.
ఇదే తరహా వదంతులు ప్రచారం చేసినందుకు బహ్రెయిన్‌లో నలుగురిని కూడా అరెస్ట్ చేశారు. మరోవైపు సౌదీ అరేబియా కూడా కఠిన హెచ్చరికలు జారీ చేసింది. పరిస్థితులపై తప్పుడు సమాచారం లేదా వదంతులు ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. ప్రజలు అధికారిక సమాచారం మాత్రమే నమ్మాలని సూచించారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!