

లోక్‌సభలో ఎన్డీయే కూటమి మరియు కాంగ్రెస్ సహా విపక్ష పార్టీల మధ్య తీవ్ర మాటల యుద్ధం చోటుచేసుకుంది. సమాజవాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ మహిళా రిజర్వేషన్ బిల్లులో సబ్ కోటా కల్పించాలని, ముఖ్యంగా ముస్లింలకు కూడా వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. విపక్షాలు బిల్లులను పూర్తిగా వ్యతిరేకించడం లేదని, కానీ సరైన చర్చ లేకుండా తొందరగా ప్రవేశపెడుతున్నారని అభ్యంతరం వ్యక్తం చేశాయి.
దీనికి స్పందించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా బిల్లు పూర్తిగా ప్రవేశపెట్టకముందే అభ్యంతరాలు ఎందుకు అని ప్రశ్నించారు. చర్చ సమయంలో అన్ని అంశాలకు సమాధానం ఇస్తామని తెలిపారు. మత ప్రాతిపదికన రిజర్వేషన్లను ఆయన ఖండించారు. స్పీకర్ ఓం బిర్లా డివిజన్ ఓటింగ్‌కు అంగీకరించగా, 207 మంది అనుకూలంగా, 126 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. కాంగ్రెస్, ఎస్పీ, టీఎంసీ, డీఎంకే వంటి పార్టీలు బిల్లుకు వ్యతిరేకంగా నిలిచాయి.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!