

డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో శాంతి ఒప్పందం దిశగా చర్చలు ముందుకు సాగుతున్నాయని వెల్లడించారు. ఇరాన్ తమ శుద్ధి చేసిన యురేనియం నిల్వలను అప్పగించేందుకు అంగీకరించినట్లు తెలిపారు. వైట్ హౌస్‌లో మాట్లాడుతూ, చర్చలు సానుకూలంగా కొనసాగుతున్నాయని, ఒప్పందంపై సంతకాలకు పాకిస్థాన్‌లో పాల్గొనే అవకాశం ఉందని పేర్కొన్నారు. కాల్పుల విరమణ గడువును పొడిగించేందుకు సిద్ధమని తెలిపారు. ఇదే సమయంలో అమెరికా రక్షణ మంత్రి పీటే హెగ్సెత్ ఇరాన్‌కు అణ్వస్త్రాలు అందకుండా చూస్తామని, ఒప్పందం కుదరకపోతే సైనిక చర్యలకు దిగుతామని హెచ్చరించారు.
ఇక పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్న వేళ, చైనా హర్మూజ్ జలసంధిలో రవాణా సురక్షితంగా సాగేందుకు చర్యలు తీసుకోవాలని ఇరాన్‌ను కోరింది. హర్మూజ్ జలసంధిను తిరిగి తెరవడం అంతర్జాతీయ అవసరమని పేర్కొంది. ఈ అంశంపై వాంగ్ యీ, అబ్బాస్ అరాగ్చీ మధ్య చర్చలు జరిగాయి. ఇదిలా ఉండగా అమెరికా ఇరాన్ చమురుపై మరిన్ని ఆంక్షలు విధించగా, ఇరాన్ ప్రతిస్పందనగా కఠిన హెచ్చరికలు జారీ చేసింది. మొహ్సిన్ రెజాయీ అమెరికాపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మరోవైపు లెబనాన్ అధ్యక్షుడు జోసెఫ్ ఔన్, బెంజమిన్ నెతన్యాహుతో చర్చలకు నిరాకరించడం పరిస్థితులను మరింత క్లిష్టం చేసింది.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!