
రాజకీయాలు

ఆర్టీసీ కార్మికులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు. హైదరాబాద్‌లో జరిగిన కేబినెట్ సమావేశంలో ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించారు. ప్రాణాలు తీసుకోవడం వంటి నిర్ణయాలు సమస్యలకు పరిష్కారం కాదని స్పష్టం చేశారు.
కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు వస్తోందని, ఇప్పటికే ఈ అంశంపై దృష్టి సారించామని తెలిపారు. సమస్యల పరిష్కారానికి చర్చలే మార్గమని సీఎం పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో రేపు కార్మిక సంఘాలతో చర్చలు నిర్వహించాలని మంత్రులకు సూచించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో మంత్రులు కార్మిక సంఘాల ప్రతినిధులతో సమావేశమై వారి సమస్యలను తెలుసుకోనున్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!