

టాలీవుడ్లో ప్రస్తుతం భారీ అంచనాలు ఉన్న సినిమాల్లో పెద్ది ఒకటి. ఇప్పటివరకు విడుదలైన గ్లింప్స్, పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. దీంతో ఈ సినిమా పై ఆసక్తి మరింత పెరిగింది. ఇటీవల చిత్రబృందం సినిమా విడుదల తేదీపై అధికారిక ప్రకటన చేసింది. ముందుగా ప్రకటించిన తేదీకి కాకుండా, కొంత ఆలస్యంగా సినిమాను విడుదల చేయాలని నిర్ణయించారు. అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా ఇప్పుడు జూన్ నెలలో విడుదల కానుంది.
వృద్ది సినిమాస్ బ్యానర్ పై బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. చిత్రబృందం వెల్లడించిన వివరాల ప్రకారం, సినిమాలోని టాకీ భాగం మొత్తం పూర్తయింది. కేవలం ఒక పాట చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే ఎడిటింగ్ పనులు కూడా ముగింపు దశకు చేరుకున్నాయి. సినిమా అవుట్‌పుట్‌ను చూసిన నిర్మాతలు సంతృప్తిగా ఉన్నారని సమాచారం. అయితే ప్రేక్షకులకు మెరుగైన థియేట్రికల్ అనుభవం ఇవ్వాలనే ఉద్దేశంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులకు మరికొంత సమయం తీసుకోవాలని టీమ్ నిర్ణయించింది. టెక్నికల్ పనులు మరింత నాణ్యతతో పూర్తి చేసి, సినిమాను పర్ఫెక్ట్గా అందించాలన్నదే వారి లక్ష్యం.
ముందుగా ఏప్రిల్ 30 న విడుదల చేయాలని ప్లాన్ చేసినప్పటికీ, ఇప్పుడు జూన్‌లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఖచ్చితమైన విడుదల తేదీని త్వరలో వెల్లడిస్తామని తెలిపారు. ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, వారి ఓపికకు తగిన స్థాయిలో మంచి కంటెంట్ అందిస్తామని చిత్రబృందం హామీ ఇచ్చింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!