
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పెద్ది’ సినిమా అనౌన్స్‌మెంట్ నుంచే భారీ అంచనాలు నెలకొల్పుతోంది. స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రతి అంశాన్ని ప్రత్యేకంగా చూపించాలని దర్శకుడు ప్లాన్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాలోని ఒక స్పెషల్ సాంగ్ గురించి వచ్చిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సాధారణంగా ఒకటి లేదా రెండు హీరోయిన్లు కనిపించే స్పెషల్ సాంగ్‌కు భిన్నంగా, ఈ పాటలో నాలుగు నుంచి ఐదు క్రేజీ హీరోయిన్లను తీసుకురావాలని దర్శకుడు భావిస్తున్నారని సమాచారం. ఈ ఐడియా వర్కవుట్ అయితే రామ్ చరణ్‌తో కలిసి ఆ పాట థియేటర్లలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే అవకాశం ఉంది. ప్రస్తుతం షూటింగ్ పనులు కొనసాగుతుండగా, తరువాత ఈ స్పెషల్ సాంగ్‌పై దృష్టి పెట్టనున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ నిర్మిస్తుండగా, ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!