
రాజకీయాలు

ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ టీవీఎస్ ఆర్బిటర్ వీ1ను విడుదల చేసింది. నగర ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని ఈ స్కూటర్‌ను ప్రత్యేకంగా రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. 1.8 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీతో వచ్చే ఈ స్కూటర్ ఒక్కసారి పూర్తి చార్జ్‌తో సుమారు 86 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదని కంపెనీ వెల్లడించింది. ఈ మోడల్ ధర రూ.84,500 (ఢిల్లీ ఎక్స్‌షోరూమ్)గా నిర్ణయించారు.
అదేవిధంగా బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్ (BaaS) విధానంలో కూడా ఆర్బిటర్ స్కూటర్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు టీవీఎస్ తెలిపింది. ఈ పథకంలో స్కూటర్ ప్రారంభ ధర రూ.49,999గా ఉండనుంది. ఇకపోతే త్వరలో విడుదల కానున్న ఆర్బిటర్ వీ2 మోడల్ 3.1 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీతో మార్కెట్లోకి రానుందని కంపెనీ పేర్కొంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!