

హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్లో నేడు మూసీ రివర్ ఫ్రంట్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎంఆర్డీసీఎల్) ఆధ్వర్యంలో ‘మూసీ ఆహ్వానం’(“MUSI INVITES”) కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై మూసీ నది పునరుజ్జీవనం మరియు రివర్‌ఫ్రంట్ అభివృద్ధి ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఈ సమావేశానికి పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, వివిధ పార్టీల నాయకులు, మేధావులు, పర్యావరణ నిపుణులు, అర్బన్ ప్లానర్లు, ఆర్కిటెక్టులు మరియు వ్యాపార సంస్థల ప్రతినిధులు కూడా హాజరుకానున్నారు.
ఈ సందర్భంగా ప్రభుత్వం మూసీ నది అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలను వివరించనుంది. స్వచ్ఛమైన నీటి సరఫరా, పర్యావరణ పరిరక్షణ, నది తీరాల అభివృద్ధి, ప్రజలకు ఉపయోగపడే మౌలిక వసతుల ఏర్పాటు వంటి అంశాలపై పవర్ పాయింట్ ద్వారా పూర్తి వివరాలు ఇవ్వనున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా నగరానికి పర్యావరణ పరంగా మరియు అభివృద్ధి పరంగా ప్రయోజనం కలుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
మూసీ పునరుజ్జీవన ప్రాజెక్ట్‌లో భాగంగా తొలి దశలో గాంధీ సరోవర్ ప్రాజెక్ట్‌ను చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రణాళిక అమలులోకి వస్తే హైదరాబాద్ నగర అభివృద్ధికి ఇది ముఖ్యమైన అడుగుగా భావిస్తున్నారు.









.jpg&w=3840&q=75)










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!