

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి టీడీపీపై తీవ్ర విమర్శలు చేస్తూ సంచలన ఆరోపణలు చేశారు. టీడీపీకి చెందిన ఒక ఎంపీ డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డారని, ఇది పార్లమెంట్ చరిత్రలో అరుదైన ఘటన అని అన్నారు. పుట్టా మహేష్ విషయాన్ని ప్రస్తావిస్తూ, ఈ వ్యవహారం ఒక్క వ్యక్తితో ఆగిపోదని చెప్పారు. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు వ్యవహరించిన తీరు సరైనది కాదని విమర్శిస్తూ, తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అదేవిధంగా తన పాలనకు, ప్రతిపక్ష పాలనకు మధ్య తేడాను ప్రజలు గుర్తించారని తెలిపారు. ప్రత్యర్థులు అవినీతి కోసం మాత్రమే అధికారంలో ఉన్నారని ఆరోపించారు. వ్యవస్థలను దెబ్బతీసి ఖజానాకు తక్కువ మొత్తమే అందించారని విమర్శించారు. ఆర్థిక ఒత్తిళ్ల మధ్య కూడా తన ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసిందని చెప్పారు. ముందుగానే క్యాలెండర్ ప్రకటించి, బడ్జెట్లో పథకాలను చేర్చి అమలు చేసిన విధానం దేశ చరిత్రలో అరుదని పేర్కొన్నారు.





















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!