

అమరావతిలోని ఆర్టీజీఎస్లో రాష్ట్రంలో ఎల్పీజీ గ్యాస్ సరఫరా పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. సీఎస్ సాయి ప్రసాద్ సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు, గెయిల్, ఓఎన్జీసీ వంటి పెట్రోలియం సంస్థల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 14 వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీ నిల్వలు ఉన్నాయని, త్వరలో మరింత సరఫరా అందుబాటులోకి రానుందని సీఎం తెలిపారు.
రాష్ట్రంలో ఎల్పీజీ కొరత లేదని స్పష్టం చేసిన సీఎం, ఆస్పత్రులు, హాస్టళ్లు, దేవాలయాలకు నిరంతర సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈకేవైసీ, ఓటీపీ విధానాల ద్వారా గ్యాస్ సిలిండర్ల దుర్వినియోగాన్ని అడ్డుకోవాలని సూచించారు. ప్రజలు ఆందోళన చెందకుండా చర్యలు తీసుకోవాలని, ప్రత్యామ్నాయాలపై అధ్యయనం చేయాలని చెప్పారు. ఇండక్షన్ స్టవ్స్ లభ్యత పెంచడం, ఉత్పత్తి మరియు పంపిణీ మెరుగుపరచడం, సిటీ గ్యాస్ నెట్వర్క్ విస్తరణపై దృష్టి సారించాలని, కేజీ బేసిన్ సహజ వాయువును పైప్డ్ నెట్వర్క్ ద్వారా అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.














.jpg&w=3840&q=75)






.jpg&w=3840&q=75)
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!