

రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే తమ ప్రధాన లక్ష్యమని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరి సమీపంలోని మయూరి టెక్ పార్క్లో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్ మెంట్ బోర్డు (APEDB) నూతన కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. పెట్టుబడులు కేవలం ఒప్పందాలకే పరిమితం కాకుండా కార్యరూపం దాల్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఏపీఈడీబీని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని పేర్కొన్న లోకేష్, యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగాల కల్పనపై దృష్టి సారించాలని చెప్పారు. జీడీ నెల్లూరులో మోహన అనే మహిళ తన పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరిన సంఘటనను గుర్తు చేసుకున్నారు. కూటమి ప్రభుత్వం 20 నెలల్లోనే భారీ పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకువచ్చిందని, దేశానికి వచ్చిన ప్రతి ₹100 పెట్టుబడిలో ₹25 ఏపీకి వచ్చాయని తెలిపారు. ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు ఏపీని పెట్టుబడులకు అనువైన గమ్యస్థానంగా ఎంచుకుంటున్నాయని పేర్కొంటూ, ఏపీఈడీబీ బృందం, సీఈవో సాయికాంత్ వర్మను అభినందించారు.




.webp&w=3840&q=75)









.jpg&w=3840&q=75)






.jpg&w=3840&q=75)
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!