

ప్రేమికుల రోజు సందర్భంగా విడుదలైన కపుల్ ఫ్రెండ్లీ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది. ఈ సినిమాలో సంతోష్ శోభన్, మానస వారణాసి ప్రధాన పాత్రల్లో నటించారు. దర్శకుడు అశ్విన్ చంద్రశేఖర్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ నిర్మించింది. సినిమా విడుదల సమయంలో ప్రభాస్ చిత్ర యూనిట్‌తో చేసిన ఇంటర్వ్యూ వల్ల ఈ సినిమాకు మంచి ప్రచారం వచ్చింది. మంచి కథతో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను ఆకట్టుకుని హిట్‌గా నిలిచింది.
ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు మరియు తమిళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ సినిమాను చూడాలంటే అదనంగా రూ.279 రెంట్ చెల్లించాలి. ఈ సినిమా నిర్మాణానికి సుమారు రూ.3 కోట్ల వరకు ఖర్చు అయ్యిందని సమాచారం. కానీ బాక్సాఫీస్ వద్ద సుమారు రూ.14 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. స్టోరీ నెమ్మదిగా సాగినప్పటికీ కథ బాగుందని ప్రేక్షకులు రివ్యూ ఇచ్చారు.
ఈ సినిమాలో నెల్లూరుకు చెందిన శివ అనే యువకుడు ఆర్కిటెక్ట్‌గా ఎదగాలని ఆశపడుతూ ఉద్యోగం కోసం చెన్నైకి వస్తాడు. అయితే సరైన అవకాశం రాకపోవడంతో రోజువారీ ఖర్చుల కోసం బైక్ పూలింగ్ చేస్తుంటాడు. అదే సమయంలో మిత్ర అనే యువతి అతని బైక్ రైడ్‌లో పరిచయం అవుతుంది. ఆమె కూడా ఉద్యోగం కోసం చెన్నైకి వస్తుంది. కొన్ని పరిస్థితుల వల్ల ఇద్దరూ ఒకే ఇంట్లో ఉండాల్సి వస్తుంది. ఈ సమయంలో వారి మధ్య ప్రేమ మొదలై లివింగ్ రిలేషన్లో ఉంటారు. తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. కానీ అప్పుడే వారి జీవితంలో ఊహించని పరిణామం జరుగుతుంది. ఆ పరిణామం ఏమిటి, చివరకు వారి ప్రేమ కథ ఎలా ముగిసింది అనేదే మిగతా కథ.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!