
రివ్యూలు

ఎన్డీఏకు ప్రజలు ఇచ్చిన తీర్పుకు రుణం తీర్చుకుంటున్నామని మంత్రి నారా లోకేశ్ అన్నారు. పుట్టపర్తిలో 650 ఎకరాల్లో రూ.15,803 కోట్ల వ్యయంతో అడ్వాన్స్‌డ్ మీడియం కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ ప్రాజెక్టుకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, సీఎం చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఐదో తరం యుద్ధ విమానాల తయారీ జరగనుందని తెలిపారు.
చంద్రబాబు నాయుడు విజన్ వల్లే పుట్టపర్తికి ప్రపంచ స్థాయి గుర్తింపు వచ్చిందని లోకేశ్ అన్నారు. ఒకప్పుడు చిన్న గ్రామంగా ఉన్న పుట్టపర్తి ఇప్పుడు ఆధ్యాత్మిక కేంద్రంగా మారిందని చెప్పారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలోని డబుల్ ఇంజిన్ ప్రభుత్వం వల్ల అభివృద్ధి వేగంగా జరుగుతోందని తెలిపారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ త్వరలో ఏర్పాటవుతుందని, రాయలసీమ మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!