
సినిమాలు

మలయాళ నూతన సంవత్సరం, పవిత్ర చింగం మాస పూజల సందర్భంగా శబరిమల అయ్యప్ప స్వామి ఆలయ ద్వారాలు ఆదివారం సాయంత్రం 5 గంటలకు తెరుచుకోనున్నాయి. ఆలయ తంత్రి కందరారు బ్రహ్మదత్తన్ సమక్షంలో ప్రధాన పూజారి గర్భగుడి తలుపులు తెరిచి ప్రత్యేక పూజలను ప్రారంభిస్తారు. ఆగస్టు 17న ఉదయం 5 గంటల నుంచి భక్తులకు స్వామివారి దర్శనం కల్పించనున్నారు.
చింగం మాస పూజలు ఆగస్టు 21న రాత్రి 10 గంటలకు ముగియడంతో ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేస్తారు. అనంతరం ఓనం పండుగ ఉత్సవాల సందర్భంగా ఆగస్టు 24న ఆలయాన్ని తిరిగి తెరవనున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు, కేరళ ఆర్టీసీ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!