

బిహార్‌లోని లఖిసరాయ్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. అశోక్‌ధామ్ ఆలయంలో సోమవారం ఉదయం జరిగిన తొక్కిసలాటలో ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో 12 మందికి పైగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. శ్రావణ మాసంలోని మూడో సోమవారం కావడంతో వేలాది మంది భక్తులు శివుడికి జలాభిషేకం చేసేందుకు ఆలయానికి తరలివచ్చారు. ఉదయం సుమారు 6.45 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ప్రాథమిక సమాచారం ప్రకారం, రద్దీగా ఉన్న ప్రాంతంలో విద్యుత్ వైర్ పడటంతో భక్తుల్లో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. దీంతో భక్తులు బయటకు వెళ్లేందుకు పరుగులు తీయగా, భారీ రద్దీ కారణంగా బారికేడ్లు కూలిపోయి పలువురు ఒకరిపై ఒకరు పడిపోయారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై బిహార్ ముఖ్యమంత్రి సమ్రాట్ చౌధరీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసి, క్షతగాత్రులకు తక్షణ వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఘటనకు అసలు కారణాన్ని పూర్తిగా నిర్ధారించిన తర్వాతే వెల్లడిస్తామని లఖిసరాయ్ జిల్లా మేజిస్ట్రేట్ శైలేంద్ర కుమార్ తెలిపారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!