

పీజీ వైద్య విద్యార్థిని డాక్టర్ ప్రియాంక (28) మృతి కేసు దర్యాప్తు అధికారిగా ఐపీఎస్ అధికారి పాటిల్ దేవరాజ్ మునీష్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా అదనపు ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న ఆయనకు కేసు దర్యాప్తు బాధ్యతలను అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేసి, నిందితులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకునేలా ఆధారాలు సేకరించాలని ప్రభుత్వం ఆదేశించింది.
దర్యాప్తులో ఐపీఎస్ అధికారి పాటిల్ దేవరాజ్ మునీష్‌కు రాజమహేంద్రవరం దక్షిణ మండల డీఎస్పీ శివప్రియ, ప్రకాశ్‌నగర్ పోలీస్ స్టేషన్ సీఐ బాజీలాల్ సహకరించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. రాజానగరంలోని జీఎస్‌ఎల్ వైద్య కళాశాలలో చర్మవ్యాధుల విభాగంలో పీజీ మొదటి సంవత్సరం చదువుతున్న ప్రియాంక.. ఆగస్టు 3న రాజమహేంద్రవరంలోని ఓ మాల్‌లో సినిమా చూసి సహచర విద్యార్థితో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యారు. తీవ్రంగా గాయపడిన ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా, ఆగస్టు 10న మృతి చెందారు. ఈ కేసును ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో దర్యాప్తు పురోగతిపై ఆసక్తి నెలకొంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!