
జనరల్

టాలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అనిల్ రావిపూడి మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌కు ప్లాన్ చేస్తున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. రామాయణం నేపథ్యంలో ఓ యానిమేషన్ మూవీని తెరకెక్కించేందుకు ఆయన సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని KVN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందించనున్నట్లు తెలుస్తోంది.
రామాయణంలోని కీలక ఘట్టాలను ఆధారంగా చేసుకుని ఈ యానిమేషన్ మూవీని రూపొందించనున్నట్లు టాక్. యానిమేషన్ సన్నివేశాల రూపకల్పన కోసం అనిల్ రావిపూడి హావభావాలను రికార్డ్ చేసి, వాటిని రిఫరెన్స్‌గా ఉపయోగించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం వెంకటేష్, కళ్యాణ్ రామ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్‌తో అనిల్ బిజీగా ఉన్నారు. ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!