

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తిరుపతి నుంచి కలికిరిలోని సీఆర్పీఎఫ్ కేంద్రాన్ని సందర్శించారు. అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించిన అనంతరం, సీఆర్పీఎఫ్ కేంద్రంలో రూ.26 కోట్ల వ్యయంతో నిర్మించిన ఆఫీసర్స్ మెస్, సబార్డినేట్ ఆఫీసర్స్ మెస్, రిక్రియేషన్ క్లబ్, స్టోర్, ట్రేడ్స్‌మెన్ బ్లాక్ భవనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.
అనంతరం జవాన్లను ఉద్దేశించి బండి సంజయ్ మాట్లాడుతూ, దేశ అంతర్గత భద్రత, సార్వభౌమత్వాన్ని కాపాడటంలో సీఆర్పీఎఫ్ కీలక పాత్ర పోషిస్తోందని ప్రశంసించారు. 24 గంటలు విధుల్లో ఉండే జవాన్ల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. కొత్తగా ప్రారంభించిన సౌకర్యాలు జవాన్ల రోజువారీ జీవనాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చడంతో పాటు, వారి పనితీరును మెరుగుపరచడంలో దోహదపడతాయని చెప్పారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!