

తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం తోకాడకు చెందిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ రాజకుమారి డయానాకు ‘బిగ్ బాస్ తెలుగు సీజన్-10’లో అవకాశం దక్కే దిశగా కీలక అడుగు పడింది. రాబోయే సీజన్ కోసం నిర్వహించిన ‘అగ్నిపరీక్ష-2’ ఆడిషన్స్‌లో డయానా ఎంపికయ్యారు. దీంతో బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టే అవకాశం ఉన్న అభ్యర్థుల జాబితాలో ఆమె పేరు చేరింది. ఆమె ఎంపికపై స్వగ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.
సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన డయానా తన ప్రతిభ, సోషల్ మీడియా ద్వారా గుర్తింపు తెచ్చుకున్నారు. ‘అగ్నిపరీక్ష-2’ ఆడిషన్స్‌లో ఎంపిక కావడం ఆమెకు బిగ్ బాస్ ప్రయాణంలో కీలక మైలురాయిగా నిలిచింది. డయానాకు ఈ అవకాశం రావడంపై తోకాడ గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే బిగ్ బాస్ తెలుగు సీజన్-10లో పాల్గొనే తుది కంటెస్టెంట్ల జాబితాను నిర్వాహకులు ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!