
జనరల్

మంత్రి సీతక్క చొరవతో అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లకు ప్రభుత్వం పెంచిన సర్వీస్ ఎండ్ బెనిఫిట్స్‌ను అమలు చేస్తోంది. 65 ఏళ్ల వయస్సులో రిటైర్ అయ్యే అంగన్‌వాడీ టీచర్లకు రూ.2 లక్షలు, హెల్పర్లకు రూ.1 లక్ష చొప్పున ప్రయోజనం అందిస్తున్నారు. 2023లో ఉన్న రూ.1 లక్ష, రూ.50 వేల ప్రయోజనాలను 2025 మే 30న ప్రభుత్వం పెంచింది.
అలాగే 60 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లు స్వచ్ఛందంగా విధుల నుంచి వైదొలిగినా పెంచిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ వర్తించేలా ప్రభుత్వం నిర్ణయించింది. వాలంటరీ డిస్‌ఎంగేజ్‌మెంట్ కింద టీచర్లకు రూ.2 లక్షలు, హెల్పర్లకు రూ.1 లక్ష చొప్పున అందించనున్నారు. ఇప్పటివరకు 2,572 మందికి రూ.15.61 కోట్ల ప్రయోజనం చెల్లించినట్లు ప్రభుత్వం తెలిపింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!