

సూరి, సుహాస్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘మండాడి’ చిత్రం నుంచి ‘తెలుసా నీకే పిల్లా’ అనే ఫీల్‌గుడ్ మెలోడీ సాంగ్ విడుదలైంది. కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించిన ఈ పాటను కృష్ణ తేజస్వీ, రేష్మ శ్యామ్ ఆలపించారు. జి.వి. ప్రకాష్ కుమార్ స్వరపరిచిన ఈ పాట శ్రోతలను ఆకట్టుకునేలా ఉంది. పాటలో సూరి, మహిమా నంబియార్ మధ్య లవ్‌ట్రాక్ ఆసక్తికరంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
ఎల్రెడ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మదిమారన్ పుగళేంది దర్శకత్వం వహిస్తున్నారు. సెప్టెంబర్ 10న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సినిమా విడుదల కానుంది. తెలుగులో మైత్రి మూవీస్ ద్వారా ఏపీ, తెలంగాణలో భారీగా రిలీజ్ చేయనున్నారు. సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఎస్.ఆర్. కథిర్ సినిమాటోగ్రఫీ, ప్రదీప్ ఇ. రాఘవ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!