

ఆంథ్రోపిక్ గూగుల్ వర్క్‌స్పేస్ కోసం కొత్త క్లాడ్ ఇంటిగ్రేషన్‌ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా గూగుల్ డాక్స్, షీట్స్, స్లైడ్స్‌లో పనిచేస్తున్న సమయంలోనే క్లాడ్ ఏఐ అసిస్టెంట్‌ను ఉపయోగించుకోవచ్చు. ఓపెన్ చేసిన ఫైల్ పక్కనే సైడ్‌బార్‌లో క్లాడ్ కనిపిస్తుంది. యూజర్లు ఎంచుకున్న టెక్స్ట్, సెల్స్ లేదా స్లైడ్స్‌ను క్లాడ్‌తో విశ్లేషించడంతో పాటు అవసరమైన మార్పులు చేయించుకోవచ్చు. గూగుల్ డాక్స్‌లో వాక్యాలను సరిచేయడం, హెడ్డింగ్స్ మార్చడం, పెద్ద స్థాయి ఎడిట్స్‌కు సూచనలు పొందడం వంటి పనులు చేయవచ్చు.
గూగుల్ షీట్స్‌లో ఫార్ములాలు, పివట్ టేబుల్స్, చార్టులు, కొత్త ట్యాబ్‌లను రూపొందించడంలో క్లాడ్ సహాయపడుతుంది. స్లైడ్స్‌లో ఇప్పటికే ఉన్న ప్రెజెంటేషన్ డిజైన్‌కు అనుగుణంగా కొత్త స్లైడ్స్ రూపొందించడంతో పాటు ఓవర్ల్యాపింగ్ ఎలిమెంట్స్, సరిగ్గా కనిపించని టెక్స్ట్ వంటి సమస్యలను గుర్తించగలదు. క్లాడ్ నుంచి నేరుగా గూగుల్ డాక్స్, షీట్స్, స్లైడ్స్ ఫైళ్లను రూపొందించి ఎడిట్ చేసుకునేలా బీటా కనెక్టర్లను కూడా ఆంథ్రోపిక్ అందించింది. ఈ సదుపాయం ప్రస్తుతం చెల్లింపు క్లాడ్ ప్లాన్‌లకు పబ్లిక్ బీటాగా అందుబాటులో ఉంది. ఎడిట్స్‌ను ఒక్కొక్కటిగా అనుమతించాలా లేదా ఆటోమేటిక్‌గా అమలు చేయాలా అనే ఎంపికను కూడా యూజర్లకు ఇచ్చింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!