

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు, ఉద్యోగాల కల్పన, అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని TDP జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్.. YSRCP అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి సవాల్ విసిరారు. నవంబర్ 22న ఎక్స్ వేదికగా ఓ పోస్టు చేసిన లోకేశ్.. 2024 నుంచి అధికారంలో ఉన్న NDA ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల వివరాలను, గత YSRCP పాలనతో పోలుస్తూ ఓ విజువల్‌ను పంచుకున్నారు. గూగుల్ రూ.1.33 లక్షల కోట్లు, ఆర్సెలర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ రూ.1.36 లక్షల కోట్లు, బ్రూక్‌ఫీల్డ్ రూ.1.06 లక్షల కోట్లు, రిలయన్స్ రూ.43 వేల కోట్ల పెట్టుబడులకు కట్టుబడ్డాయని, రెన్యూ సంస్థ కూడా పెట్టుబడుల జాబితాలో ఉందని అందులో పేర్కొన్నారు.
వివిధ రంగాలకు చెందిన ప్రముఖ సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయని, ఈ ప్రాజెక్టుల ద్వారా ఇప్పటికే వేలాది ఉద్యోగాలు కల్పించామని లోకేశ్ పేర్కొన్నారు. ప్రాజెక్టులను అడ్డుకునేందుకు YSRCP నేతలు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు (PILలు) దాఖలు చేసి, ఆ తర్వాత వాటి ఘనతను తమ ఖాతాలో వేసుకుంటున్నారని ఆరోపించారు. పెట్టుబడులు, ఉద్యోగాలు, అభివృద్ధిపై రెండు పార్టీల పనితీరును బహిరంగంగా చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. జగన్ ఈ సవాల్‌ను స్వీకరిస్తారా? లేక బర్నాల్ పంపించాలా? అంటూ వ్యంగ్యంగా ప్రశ్నించారు. ఈ పోస్టుకు #CreditChorJagan అనే హ్యాష్‌ట్యాగ్‌ను జత చేశారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!