
రాజకీయాలు

మహబూబాబాద్ జిల్లా కురవిలోని భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయం వద్ద ఉన్న ఓ చిన్న రేకుల గదికి భారీ అద్దె పలికింది. ఆలయం తూర్పు రాజగోపురం పక్కన కొన్నేళ్ల క్రితం కొబ్బరికాయలు, పూజా సామగ్రి విక్రయించేందుకు ఇటుకలు, రేకులతో ఈ గదిని నిర్మించారు. ఆలయం ఎదుట ఉన్న దుకాణాలను అద్దెకు ఇచ్చేందుకు అధికారులు శనివారం వేలం నిర్వహించారు. ఈ వేలంలో పలువురు వ్యాపారులు పోటీపడటంతో చిన్న గదికి కూడా భారీ ధర పలికింది.
కురవికి చెందిన బండారి రమేశ్ నెలకు రూ.2.12 లక్షల అద్దె చెల్లించేందుకు అంగీకరించి ఈ గదిని దక్కించుకున్నారు. గతేడాది ఇదే దుకాణానికి నెలకు రూ.93,600 అద్దె మాత్రమే వచ్చింది. ఈసారి వేలంలో అద్దె రెట్టింపునకు పైగా పెరగడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఆలయం వద్ద వ్యాపారానికి ఉన్న డిమాండ్‌ను ఈ వేలం ప్రతిబింబిస్తోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!