

ప్రముఖ గేమింగ్ స్ట్రీమర్ ఐషోస్పీడ్ (IShowSpeed) తన జీటీఏ 6 (GTA VI) గేమ్‌ప్లేతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. రాక్‌స్టార్ గేమ్స్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన గ్రాండ్ తెఫ్ట్ ఆటో 6 గేమ్‌పై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. దాదాపు 13 ఏళ్ల పాటు అభివృద్ధి చేసినట్లు ప్రచారం జరుగుతున్న ఈ గేమ్‌ను స్పీడ్ కేవలం రెండు రోజుల్లోనే దాదాపు 90 శాతం పూర్తి చేసినట్లు సమాచారం. అతడి గేమింగ్ వేగం, ఉత్సాహం చూసి అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ గేమ్‌ప్లేకు సంబంధించిన వీడియోలు, విశేషాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
దాదాపు 40 గంటల పాటు నిద్ర లేకుండా గేమ్ ఆడిన స్పీడ్.. తన ఉత్సాహాన్ని ఏమాత్రం దాచుకోలేకపోయాడు. గేమ్‌లో కీలకమైన మైలురాయిని చేరుకున్న ఆనందంలో ఏకంగా బ్యాక్‌ఫ్లిప్ చేసి సంబరాలు చేసుకున్నాడు. గేమ్ ఆడుతున్నంతసేపూ అతడి హావభావాలు, ఉత్సాహభరితమైన స్పందనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తనదైన ప్రత్యేకమైన శైలితో అభిమానులను అలరించిన స్పీడ్ మరోసారి ప్రపంచవ్యాప్తంగా అత్యంత వినోదాత్మక గేమింగ్ స్ట్రీమర్లలో తాను ఒకడినని నిరూపించుకున్నాడు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!