
రాజకీయాలు

ఐటీఐ విద్యార్థులకు కూడా ఐఐటీ పట్టభద్రులతో సమానంగా గౌరవం, గుర్తింపు లభించాలని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ అన్నారు. నైపుణ్య ఆధారిత వృత్తులు, వాటిని ఎంచుకునే విద్యార్థుల పట్ల సమాజం దృక్పథం మారాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఐటీఐ విద్యపై ఉన్న చిన్నచూపు తొలగాలని, సాంకేతిక నైపుణ్యాలతో కూడిన పనులకు తగిన గుర్తింపు, గౌరవం కల్పించాలని ఆయన అభిప్రాయపడ్డారు.
జర్మనీని ఉదాహరణగా ప్రస్తావించిన లోకేశ్.. అక్కడ నైపుణ్య కార్మికులకు ఎంతో గౌరవం ఉంటుందని, ఆ దేశ పారిశ్రామిక ప్రగతికి అది కీలక బలంగా నిలుస్తోందని చెప్పారు. భారత్‌లోనూ ఇదే తరహా సంస్కృతి పెరగాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ తాము ఎంచుకున్న వృత్తి పట్ల గర్వంగా ఉండాలని, నైపుణ్య ఆధారిత పనులను సమాజం గౌరవించేలా అవగాహన పెరగాలని పిలుపునిచ్చారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!