

రాక్‌స్టార్ గేమ్స్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా విడుదల చేసిన 'గ్రాండ్ తెఫ్ట్ ఆటో 6 (GTA 6)' ప్రపంచ గేమింగ్ రంగంలో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. 2026 నవంబర్ 19న విడుదలైన ఈ గేమ్.. తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా 3.79 బిలియన్ డాలర్ల రిటైల్ అమ్మకాలను సాధించినట్లు మాతృసంస్థ టేక్-టూ ఇంటరాక్టివ్ వెల్లడించింది. అంతేకాకుండా విడుదలకు ముందే అన్ని ప్లాట్‌ఫారమ్‌లలో కలిపి 3.25 కోట్ల యూనిట్లు అమ్ముడైనట్లు రాక్‌స్టార్ ప్రకటించింది. ఇది ప్రీ-రిలీజ్ అమ్మకాలలో సరికొత్త రికార్డుగా నిలిచింది. విమర్శకుల నుంచి కూడా ఈ గేమ్‌కు విశేష ప్రశంసలు లభించాయి. మెటాక్రిటిక్లో 99 స్కోరు సాధించింది. గత ప్రధాన గేమ్ విడుదలైన దాదాపు 13 ఏళ్ల తర్వాత వచ్చిన GTA 6.. ప్రపంచ వినోద రంగంలోనే అతిపెద్ద లాంచ్‌లలో ఒకటిగా నిలిచింది.
భారత్‌లోనూ ఈ గేమ్ ధరలు గేమింగ్ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అధికారిక ప్లేస్టేషన్ ఇండియా స్టోర్ వివరాల ప్రకారం.. స్టాండర్డ్ ఎడిషన్ ధర రూ.5,999 కాగా, అల్టిమేట్ ఎడిషన్ ధర రూ.7,499గా ఉంది. ప్లేస్టేషన్ 5, PS5 ప్రో కన్సోళ్లపై అందుబాటులో ఉన్న ఈ గేమ్‌లో ఆటగాళ్లు కల్పిత రాష్ట్రం లియోనిడాలోని వైస్ సిటీ నేపథ్యంలో సాగే కథను అనుభవించనున్నారు. జేసన్, లూసియా ప్రధాన పాత్రలుగా కథ సాగుతుంది. భారీ అమ్మకాలు, విమర్శకుల ప్రశంసలు, ప్రపంచవ్యాప్త ఆదరణతో GTA 6 గేమింగ్ చరిత్రలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!