

కావ్య మారన్‌కు చెందిన సన్‌రైజర్స్ లీడ్స్‌కు ది హండ్రెడ్ ఉమెన్స్ 2026 ఫైనల్‌లో ఘోర పరాజయం ఎదురైంది. లార్డ్స్‌లో జరిగిన టైటిల్ పోరులో ట్రెంట్ రాకెట్స్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించి తొలిసారి ది హండ్రెడ్ ఉమెన్స్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ లీడ్స్ 91 పరుగులకే ఆలౌట్ కాగా.. ట్రెంట్ రాకెట్స్ బౌలర్లలో జార్జియా ఆడమ్స్, చార్లీ ఫిలిప్స్, కిమ్ గార్త్, సమంతా బేట్స్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.
91 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ట్రెంట్ రాకెట్స్‌కు సోఫియా డంక్లీ, బెత్ మూనీ అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. డంక్లీ 23 బంతుల్లో 41 పరుగులు చేయగా, మూనీ 31 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది. వీరిద్దరూ 69 పరుగుల భాగస్వామ్యంతో మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చారు. చివర్లో యాష్లే గార్డ్నర్ బౌండరీతో విజయాన్ని పూర్తి చేయగా.. ట్రెంట్ రాకెట్స్ 54 బంతుల్లోనే 92/2కు చేరుకుని 46 బంతులు మిగిలుండగానే ఘన విజయం సాధించింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!