

ఐపీఎల్‌కు ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నాడు. ధోనీతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ అతడి ప్రతిభను, భారత క్రికెట్‌కు అందించిన సేవలను ప్రశంసించాడు. ధోనీ కెరీర్ ఆరంభంలోనే అతడిలో అసాధారణమైన బ్యాటింగ్ సామర్థ్యం ఉందని గుర్తించినట్లు వెల్లడించాడు.
బంగ్లాదేశ్‌లో ధోనీ బ్యాటింగ్‌ను తొలిసారి చూసినప్పుడే అతడి పవర్ హిట్టింగ్‌లో ఏదో ప్రత్యేకత ఉందని సౌరభ్ గంగూలీతో చెప్పినట్లు సచిన్ గుర్తుచేసుకున్నాడు. అతడిలో అరుదైన ప్రతిభ ఉందని అప్పుడే అర్థమైందని తెలిపాడు. ఆ తర్వాత ధోనీ ప్రయాణం అద్భుతంగా సాగిందని పేర్కొన్నాడు. అతడితో కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం, భారత క్రికెట్‌లో ఎన్నో మధుర క్షణాల్లో భాగస్వామి కావడం తనకు ఎంతో ఆనందాన్నిచ్చిందని చెప్పాడు. ధోనీ గొప్ప విజయాలు సాధిస్తాడని ఎప్పుడూ నమ్మానని, అయితే తాను ఊహించిన దానికంటే ఎన్నో గొప్ప విజయాలను అతడు అందుకున్నాడని ప్రశంసించాడు. భారత క్రికెట్‌కు అత్యుత్తమ సేవలు అందించిన ధోనీతో కలిసి ఈ ప్రయాణంలో సాగడం ఆనందంగా ఉందని చెబుతూ.. “బాగా ఆడావు ఎంఎస్!” అంటూ తన సందేశాన్ని ముగించాడు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!