

మలయాళ స్టార్ హీరోలు మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్ ఈ శుక్రవారం తమ సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. మమ్ముట్టి నటించిన ‘ఓఎం’, దుల్కర్ సల్మాన్ నటించిన ‘ఆకాశంలో ఒక తార’ చిత్రాలు పలు భాషల్లో విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో రెండు సినిమాల మేకర్స్ ప్రమోషన్ల కోసం ఓ వినూత్న ఆలోచనతో ముందుకొచ్చారు. తండ్రీకొడుకులు కలిసి కనిపించిన ప్రత్యేక వీడియో బైట్‌ను విడుదల చేశారు. ఈ వీడియోలో ఇద్దరు స్టార్ హీరోలు ఒకరి సినిమాను మరొకరు ప్రమోట్ చేయడం అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
ఈ ప్రమోషనల్ వీడియోలో మమ్ముట్టి తన కుమారుడు దుల్కర్ సల్మాన్ నటించిన ‘ఆకాశంలో ఒక తార’ సినిమాను తెలుగులో ప్రమోట్ చేయగా, దుల్కర్ తన తండ్రి మమ్ముట్టి నటించిన ‘ఓఎం’ చిత్రాన్ని తమిళంలో పరిచయం చేశారు. తండ్రీకొడుకులు వేర్వేరు భాషల్లో ఒకరి సినిమాకు మరొకరు మద్దతుగా నిలవడం అభిమానులకు ప్రత్యేక అనుభూతిని అందిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒకే రోజు థియేటర్లలోకి రానున్న ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాయోనని సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!