
బిజినెస్

భగవాన్ సత్యసాయి 101వ జయంతి ఉత్సవాలు పుట్టపర్తిలో ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా నిర్వహించిన మహిళా దినోత్సవ కార్యక్రమానికి ప్రముఖ కథానాయిక రష్మిక మందన్న హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె సత్యసాయి సమాధిని దర్శించుకుని నివాళులర్పించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ఆమె రాకతో కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణ ఏర్పడింది.
ఈ సందర్భంగా రష్మిక సత్యసాయి బోధనల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సత్యసాయిని విజయ్, ఆనంద్ ఎంతో అభిమానంతో ఆరాధిస్తారని వెల్లడించారు. ఆయన బోధనలు తనపై ఎంతో ప్రభావం చూపాయని తెలిపారు. అవి కేవలం బోధనలు మాత్రమే కాదని, మనిషి అనుసరించాల్సిన జీవన విధానమని రష్మిక పేర్కొన్నారు. సత్యసాయి సందేశాలు ప్రతి ఒక్కరి జీవితానికి మార్గదర్శకంగా నిలుస్తాయని ఆమె అభిప్రాయపడ్డారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!