

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి అధ్యక్షతన దీక్షా దివస్ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ నెల 29న కరీంనగర్లో జరగనున్న 'చలో కరీంనగర్' కార్యక్రమాన్ని విజయవంతం చేసే అంశంపై సమావేశంలో చర్చించారు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎమ్మెల్సీ ఎల్. రమణ, నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు, జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట ఆగయ్య, కరీంనగర్ మాజీ జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ చక్రపాణి కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై మాట్లాడారు.
ఈ నెల 29న కరీంనగర్లో నిర్వహించనున్న దీక్షా దివస్ సభకు సిరిసిల్ల నుంచి భారీ సంఖ్యలో తరలిరావాలని వారు పిలుపునిచ్చారు. తెలంగాణ వాదులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, యువతతో పాటు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ దార్ల సందీప్, అర్బన్ బ్యాంక్ చైర్మన్ రాపల్లి లక్ష్మీనారాయణ, మున్సిపల్ కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, సెస్ డైరెక్టర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!