

ఇటీవల కురిసిన మంచుతో కశ్మీర్ లోయలో చలి తీవ్రత గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా ఎత్తైన ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు వేగంగా పడిపోతున్నాయి. గుల్మార్గ్‌లో రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు సున్నా డిగ్రీల కంటే దిగువకు చేరడంతో నీటి పైపులు, చిన్న నీటి ప్రవాహాలు సైతం గడ్డకట్టాయి. లోయలో శీతాకాలం అధికారికంగా ప్రారంభమైందని వాతావరణ శాఖ వెల్లడించింది. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉందని అంచనా వేసింది.
ఇదిలా ఉండగా, శుక్రవారం సాయంత్రం నుంచి మరో వెస్ట్రన్ డిస్టర్బెన్స్ ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఎత్తైన ప్రాంతాల్లో మరింత మంచు కురవడంతో పాటు మైదాన ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. కశ్మీర్‌లో అత్యంత తీవ్రమైన చలిని సూచించే 40 రోజుల చిల్లై కలాన్ ప్రారంభానికి ముందే వాతావరణం కఠినంగా మారుతోంది. చలి గాలులు, మంచు ప్రభావం నేపథ్యంలో స్థానికులు, పర్యాటకులు అప్రమత్తంగా ఉంటున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!