

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇటీవల తన తల్లిదండ్రులైన సోనియా గాంధీ, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీల మధ్య ఉన్న ఆప్యాయత గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. కుటుంబ సభ్యులంతా కలిసి భోజనం చేసే సమయంలో తన తల్లి సోనియా గాంధీ.. తండ్రి రాజీవ్ గాంధీ ఒడిలో కూర్చునేవారని రాహుల్ గుర్తుచేసుకున్నారు. అయితే, ఈ విషయంపై కొందరు సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేయడంతో వివాదం మొదలైంది. ఈ నేపథ్యంలో నటి సోనాక్షి సిన్హా స్పందిస్తూ, దంపతుల మధ్య ఉండే ప్రేమానురాగాలను ప్రశ్నిస్తున్న వారికి ఇన్‌స్టాగ్రామ్ వేదికగా కౌంటర్ ఇచ్చారు.
భార్యాభర్తల మధ్య ఆప్యాయతను వ్యక్తం చేయడంలో తప్పేమీ లేదని సోనాక్షి తన అభిప్రాయాన్ని వెల్లడించారు. తల్లిదండ్రుల మధ్య ఇలాంటి ప్రేమను చూసినప్పుడు తన పిల్లలు కూడా సానుకూలంగా స్పందిస్తారని ఆమె పేర్కొన్నారు. ఒక జంట మధ్య ఉండే అనుబంధాన్ని బయటి వ్యక్తులు విమర్శించడం లేదా తీర్పులు ఇవ్వడం సరికాదనే భావనను ఆమె తన వ్యాఖ్యల ద్వారా వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై కొనసాగుతున్న చర్చ మధ్య సోనాక్షి స్పందన ప్రస్తుతం ప్రాధాన్యం సంతరించుకుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!