

ఐపీఎల్ 2026లో లక్నో సూపర్ జెయింట్స్ అద్భుత ప్రదర్శనతో చెన్నై జట్టుపై ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసింది. కార్తిక్ శర్మ 42 బంతుల్లో 71 పరుగులతో అద్భుతంగా రాణించగా, శివమ్ దూబే 32 పరుగులతో అజేయంగా నిలిచాడు. డేవాల్డ్ బ్రేవిస్ 25 పరుగులు చేసి జట్టుకు తోడ్పాటునిచ్చాడు. లక్నో బౌలర్లలో ఆకాశ్ సింగ్ మూడు కీలక వికెట్లు తీసి చెన్నైను ఒత్తిడిలోకి నెట్టాడు.
188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో జట్టు ప్రారంభం నుంచే దూకుడుగా ఆడింది. మిచెల్ మార్ష్ విధ్వంసకర బ్యాటింగ్‌తో కేవలం 38 బంతుల్లో 90 పరుగులు చేసి మ్యాచ్‌ను పూర్తిగా లక్నో వైపు తిప్పేశాడు. జోష్ ఇంగ్లిస్ 36 పరుగులతో మంచి భాగస్వామ్యం అందించగా, నికోలస్ పూరన్ 17 బంతుల్లో 32 పరుగులతో వేగంగా ఆడాడు. చివర్లో ముకుల్ చౌదరి 13 పరుగులతో జట్టును విజయతీరాలకు చేర్చాడు.
చెన్నై బౌలర్లలో ముఖేష్ చౌదరి, స్పెన్సర్ జాన్సన్ తలో వికెట్ తీశారు. అయితే లక్నో బ్యాటర్ల దూకుడును అడ్డుకోలేకపోయారు. లక్నో జట్టు కేవలం 16.4 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. ఈ విజయంతో లక్నో జట్టు పాయింట్ల పట్టికలో మరింత బలమైన స్థితికి చేరుకుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!