
సినిమాలు

కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. పోక్సో కేసులో భవిష్యత్తులో తన పేరు వాడకూడదని కోరుతూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. తన పేరుతో ఇప్పటివరకు ప్రసారం చేసిన వీడియోలను తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు.
మరోవైపు బండి భగీరథ్ కేసులో బాలికకు సంబంధించిన వివరాలు సోషల్ మీడియాలో ప్రసారం కావడంపై కేసు నమోదైంది. బాలిక ఫోటోలు, వీడియోలు, అలాగే తల్లిదండ్రుల వివరాలు షేర్ చేసినందుకు పోలీసులు చర్యలు తీసుకున్నారు. మేడ్చల్ జిల్లా బాలల సంక్షేమ కమిటీ ఛైర్పర్సన్ ఫిర్యాదు మేరకు పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి సోషల్ మీడియా నిర్వాహకులపై దర్యాప్తు ప్రారంభించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!