
జనరల్

విరాట్ కోహ్లీ టీమ్‌ఇండియాలో తన భవిష్యత్తు, జట్టుపై నిబద్ధత గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇప్పటికే టీ20లు, టెస్టులకు వీడ్కోలు పలికిన కోహ్లీ, వన్డేల్లో మాత్రం జట్టుకు ఉపయోగపడతానని భావిస్తే ఎప్పుడూ సిద్ధంగానే ఉంటానని తెలిపాడు. అయితే ప్రతిసారీ తన నిబద్ధతను నిరూపించుకోవాల్సిన పరిస్థితి రావడం మాత్రం ఇష్టంలేదని స్పష్టం చేశాడు.
ఏడాది పొడవునా ఫిట్‌నెస్, సన్నద్ధత విషయంలో కఠినంగా ఉంటానని కోహ్లీ పేర్కొన్నాడు. భారత టెస్టు జట్టుకు నాయకత్వం వహించిన కాలాన్ని స్వర్ణయుగంగా అభివర్ణిస్తూ, ఆ సమయంలో జట్టులో ఐక్యత, బలమైన బెంచ్ స్ట్రెంత్, విదేశాల్లో సాధించిన విజయాలు ప్రత్యేకమని తెలిపాడు. 2027 వన్డే ప్రపంచకప్‌లో ఆడటంపై కూడా స్పందించిన కోహ్లీ, అది తాను ఒక్కడే తీసుకునే నిర్ణయం కాదని చెప్పాడు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!