
జనరల్

మాజీ భారత ప్రధాన కోచ్ రవిశాస్త్రి టీమ్ఇండియా టీ20 జట్టుకు సంజు శాంసన్ బలమైన కెప్టెన్సీ అభ్యర్థి అని అభిప్రాయపడ్డాడు. సంజుకు నాయకత్వ లక్షణాలు, విధ్వంసకర బ్యాటింగ్ సామర్థ్యం ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన సంజు ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు.
గత టీ20 ప్రపంచకప్‌లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచిన సంజు శాంసన్‌పై ఉన్న అనుమానాలను రవిశాస్త్రి కొట్టిపారేశారు. కొన్నిసార్లు ఆశించిన స్థాయిలో ఆడకపోయినా అతడి ప్రతిభ అసాధారణమని కొనియాడారు. అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌లోనూ తన ఆటతో సంజు భవిష్యత్ నాయకత్వ పోటీలో ఉన్నాడని స్పష్టమవుతోందని రవిశాస్త్రి తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!